![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనగానే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు పల్లవి ప్రశాంత్.. అలా అందరి చేత ప్రశంసలు అందుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి టీవీ అభిమానులందరికి తెలుసు.
అయితే పల్లవి ప్రశాంత్ తాజాగా 'బహిష్కరణ' వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. అతనితో పాటు సోహైల్, మెహబూబ్, వీజే సన్నీ, అర్జున్, అవినాష్ , రీతు చౌదరిలు కూడా వచ్చారు. అందులో సోహెల్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇచ్చిన స్పీచ్ లు వైరల్ గా మారాయి.
ప్రెస్ మీట్ లో హీరోయిన్ అంజలికి పల్లవి ప్రశాంత్ రోజా పువ్వు ఇచ్చాడు. ఆ తర్వాత తను మాట్లాడుతూ ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ వెబ్ సిరీస్ దర్శకుడు.. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ సమయంలో తన ఏవీ షూట్ చేశాడట. ఆ ఒక్క రోజే ఆయనతో అనుబంధం ఏర్పడిందని, కష్టపడి బాగా తీశాడని తెలిపాడు పల్లవి ప్రశాంత్. ఏవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వే బిగ్ బాస్ విన్నర్ వి అని చెప్పాడని, అప్పుడు తనకు చాలా హ్యాపీగా అనిపించిందని, అదే కాన్ఫిడెన్స్ తో షోకి వెళ్లినట్టు పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇక బహిష్కరణ దర్శకుడు ముఖేష్ ప్రజాపతి బిగ్ బాస్ ప్రోమోలు ఎడిట్ చేస్తాడని తెలిసాక నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |